ARJUN SAMAACHAARAM
Newspaper Banner
Date of Publish : 21 July 2026, 7:29 am Posted by : ARJUN SAMAACHAARAM DESK

ఉపాధ్యాయ సమస్య ల కోసం ధర్నా

ఉపాధ్యాయ సమస్య ల కోసం ధర్నా

జగిత్యాల ప్రతినిధి ::
జులై 20 అర్జున్ సమాచారం

పట్టణంలో విద్యారంగం ఉపాధ్యాయ సమస్యల పరిష్కారం పై తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘం(TUPUS) జగిత్యాల జిల్లా శాఖ వారి ఆధ్వర్యంలో నిర్వహించిన ధర్నా కార్యక్రమంలో పాల్గొని వారికి సంఘీభావం తెలియజేసిన జగిత్యాల జిల్లా తొలి జడ్పీ చైర్పర్సన్ దావ వసంత సురేష్ గారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ….

  • ఆనాడు తెలంగాణ రాష్ట్ర సాధనలో ఉపాధ్యాయుల పాత్ర చాలా కీలకమని అన్నారు.
  • సాధించుకున్న తెలంగాణలో మళ్లీ ఉపాధ్యాయుల హక్కుల కోసం పోరాటం చేయాల్సి వస్తుందని అన్నారు.
  • నాలుగు గోడల మధ్యలో విద్యార్థుల భవిష్యత్తు తీర్చిదిద్దాల్సిన ఉపాధ్యాయులు ఈరోజు రోడ్డుపై ఎక్కి వారి హక్కుల కోసం ధర్నా చేస్తున్నారు అంటే సాధించుకున్న తెలంగాణలో నే మనం ఉన్నామా అని అనిపిస్తుందని అన్నారు.
  • ఎన్నికల సమయంలో ఉపాధ్యాయుల ఓట్లు కోసం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉపాధ్యాయులను మభ్యపెట్టి అనేక హామీలు ఇచ్చారని అన్నారు.
  • గద్దెనెక్కిన తర్వాత ఇచ్చిన హామీలు మర్చిపోయి ఉపాధ్యాయులను రోడ్డుపైకి తీసుకొచ్చేన ఘనత ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నది అని అన్నారు.
  • 51% పి ఆర్ సి ని తెప్పించుకొని వెంటనే ఫిట్మెంట్ విడుదల చేయాలని అన్నారు
  • పెండింగ్ లో ఉన్న ఆర్డిఏ లను వెంటనే చెల్లించి మరియు పెండింగ్లో ఉన్న బిల్లులను కూడా చెల్లించాలని డిమాండ్ చేశారు.
  • 2003 డిఎస్సి ఉపాధ్యాయులకు పాత పెన్షన్ విధానాన్ని అమలు చేయడంతో పాటు సిపిఎఫ్ ను రద్దు చేసి ఓపిఎఫ్ ను అమలు చేయాలని అన్నారు.
  • జిల్లా కలెక్టర్ గారు వెంటనే స్పందించి ఉపాధ్యాయుల
    సమస్యలను ప్రభుత్వం దృష్టికి వెంటనే తీసుకెళ్లి పరిష్కరించాలని అన్నారు.
    కెసిఆర్ గారు 73%పీఆర్సీ ఇచ్చిన ఉపాధ్యాయులను గొప్పగా గౌరవించారన్నారు.
  • ఉపాధ్యాయులకు ఎలాంటి సమస్యలు లేనప్పుడే విద్యార్థులను సమాజానికి ఉపయోగపడే విధంగా తీర్చిదిద్దుతారని అన్నారు.
  • ఉపాధ్యాయులకు బిఆర్ఎస్ పార్టీ ఎప్పుడు అండగా ఉంటుందని ప్రభుత్వం వెంటనే స్పందించి వీరి సమస్యలు పరిష్కరించాలని అన్నారు.
    ఈ కార్యక్రమంలో పట్టణ BRS పార్టీ అధ్యక్షుడు అయిల్నేని వెంకటేశ్వర్ రావు TUPUS సంఘ ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు.